- రెండు రోజులు అనుమతి ఇస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పైలెట్ రోహిత్ రెడ్డి సహా ఆయన సోదరుడు రితేశ్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ సిట్ కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు మరోసారి అనుమతి ఇచ్చింది. రెండు రోజులు కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు విచారించాలని ఆదేశించింది.
కాగా, ఈ కేసులో రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను మంగళవారం డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చంచల్ గూడ జైలులో ఉన్న నిందితులను సిట్ అధికారులు గురువారం ఉదయం కస్టడీకి తీసుకోనున్నారు. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించనున్నారు.
