మొయినాబాద్ యువతి సజీవదహనం కేసులో మరో ట్విస్ట్

మొయినాబాద్ యువతి సజీవదహనం కేసులో మరో ట్విస్ట్

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో సంచలనం రేపిన యువతి సజీవదహనం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. మల్లేపల్లి వాసి తైసీన్  పెట్రోల్ తో నిప్పంటించుకుని  సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.  జనవరి 8న ఇంట్లో గొడవ పడి మల్లెపల్లి నుంచి బయటకు వెళ్లగా పేరెంట్స్ గాలింపు చేపట్టారు. 10న హబీబ్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. 

యువతి సజీవదహనం ఘటన స్థలంలో దొరికిన ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు ముందు యువతి తన  కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు గుర్తించారు. గతంలో కూడా తైసిన్  ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.  వ్యక్తిగత కారణాలతో పాటు కుటుంబ కలహాలతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. 

జనవరి 8న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో పట్టపగలే  గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ సజీవదహనం అవుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు .  మృతదేహం పక్కనే సగం కాలిన మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొబైల్ కాల్స్ ఆధారంగా యువతి తన చివరి కాల్ తల్లిదండ్రులతో మాట్లాడినట్లు గుర్తించారు. యువతిని ఎవరూ హత్య చేయలేదని తానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.