హైదరాబాద్ కు రుతు పవనాలు.. మొదలైన వర్షాలు

హైదరాబాద్ కు రుతు పవనాలు.. మొదలైన వర్షాలు

హైదరాబాద్ సిటీలోకి రుతు పవనాలు వచ్చేశాయ్.. నిన్నటికి నిన్న రాయలసీమను తాకిన రుతు పవనాలు.. జూన్ 21వ తేదీ సాయంత్రం హైదరాబాద్ సిటీని తాకాయి. ఈ ప్రభావంతోనే బుధవారం ఉదయం నుంచి హైదరాబాద్ సిటీ వాతావరణ మారిపోయింది. ఎండ తీవ్రత తగ్గింది.

రుతు పవనాల రాకతో.. హైదరాబాద్ సిటీలో వర్షాలు మొదలయ్యాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి వర్షం పడటం ప్రారంభం అయ్యింది. ఇన్నాళ్లు మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం.. వర్షంతోపాటు చల్లటి గాలులతో రిలాక్స్ అయ్యారు.

హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సైదాబాద్, దిల్ షుఖ్ నగర్, కాప్రా, మల్కాజిగిరి, హైటెక్ సిటీ,  కొండాపూర్ ప్రాంతంలో వర్షం పడుతుంది. చాలా రోజుల తర్వాత చల్ల గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో.. జనం ఎంజాయ్ చేస్తున్నారు. 

ALSO READ: వర్షాల సీజన్ కదా.. ఈ ఫ్రూట్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది

ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలోనే వర్షం మొదలు కావటంతో.. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి.