వర్షాల సీజన్ కదా.. ఈ ఫ్రూట్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది

వర్షాల సీజన్ కదా.. ఈ ఫ్రూట్స్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది

వేసవి కాలం పోయి వర్షాకాలం వచ్చేసింది. ఇప్పుడిప్పుడే వానలు కురుస్తున్నాయి. వాతావరణం మారిపోయింది. కాబట్టి దాన్ని బట్టి జీవన శైలిలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తినే ఆహారంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

దానిమ్మ

పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న దానిమ్మ పండు అనారోగ్యాలను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్ బి ఎర్రరక్త కణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది, రక్త ప్రసరణను కూడా సులభతరం చేస్తుంది.

ఆల్బుకాహార

ఇది మలబద్దకం నుంచి ఉపశమనం పొందడంలో చాలా సహాయపడుతుంది. ఇనుము శోషణను పెంచుతుంది. ఇందులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది హీమోగ్లోబిన్ కంటెంట్ ను పెంచి, రక్త హీనతను కూడా నివారిస్తుంది. ఈ పండ్లలో ఎరుపు-నీలం వర్ణద్రవ్యం (ఆంథోసైనిన్) క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.

పీచు

ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ఎ, బి, సిలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల బరువు తగ్గడంలోనూ ఇది సహాయపడుతుంది.

లిట్చి

ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

సీతాఫలం

శరీర ఉష్ణోగ్రతను తగ్గించే శీతలీకరణ గుణాలు ఈ పండులో ఉన్నాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపర్చడంలోనూ సహాయపడుతుంది,

ఆపిల్

ఆపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలానుగుణంగా వచ్చే మార్పులు, వ్యాధులు పోరాడడానికి శరీరానికి సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. గుండె వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది..

పియర్

డైటరీ ఫైబర్, ఫైటో న్యూట్రియెంట్స్(మెుక్కల రసాయనాలు), యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పియర్ పండు.. చర్మానికి, జుట్టుకు మంచిది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

జామున్

వర్షాకాలంలో మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునే ఈ పండులో అధిక మొత్తంలో పోషకాలు, తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది వర్షాకాలంలో సంభవించే గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు, హీమోగ్లోబిన్ ను మెరుగుపరుస్తుంది. దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.