Usman Khawaja: పాకిస్థాన్‌లో పుట్టి ఆసీస్ దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగాడు: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన స్టార్ ఓపెనర్

Usman Khawaja: పాకిస్థాన్‌లో పుట్టి ఆసీస్ దిగ్గజ క్రికెటర్‌గా ఎదిగాడు: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన స్టార్ ఓపెనర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్, టెస్ట్ స్పెషలిస్ట్ ఉస్మాన్ ఖవాజా తన అంతర్జాతీయర్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. శుక్రవారం (జనవరి 2) విలేఖరుల సమావేశంలో ఖవాజా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. యాషెస్ లో భాగంగా ఆదివారం (జనవరి 4) సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగే చివరిదైన ఐదో టెస్ట్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో చివరిదని తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఆస్ట్రేలియా తరపున 15 ఏళ్ళు టెస్ట్  క్రికెట్ ఆడి స్టార్ ఓపెనర్ గా పేరొందిన ఉస్మాన్.. తన 15 ఏళ్ళ సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతూ ఎమోషనల్ అయ్యాడు. 

రిటైర్మెంట్ తర్వాత ఖవాజా మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "నేను కొంతకాలం నుంచి నా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాను. యాషెస్ సిరీస్ ప్రారంభమైనప్పుడే ఇది నాకు చివరి సిరీస్ అవుతుందని భావించాను. అడిలైడ్ టెస్ట్‌కు మొదట ఎంపిక కాకపోవడంతో ఆట నుండి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం చేసుకున్నాను. నేను నా భార్య రాచెల్ తో ఈ విషయం గురించి మాట్లాడాను. నా కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కు కొన్ని రోజుల క్రితం ఈ విషయం చెప్పాను. నా ఫేవరేటే గ్రౌండ్ సిడ్నీలో చివరి టెస్ట్ ఆడడం చాలా సంతోషంగా ఉంది". అని SCG ప్రెస్ రూమ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఖవాజా చెప్పుకొచ్చాడు. 

ఖవాజా చిన్నతనంలో ఇస్లామాబాద్ నుండి ఆస్ట్రేలియాకు వలస వచ్చాడు. తాను ఒక ముస్లీమ్ గా ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. 2011లో తొలిసారి ఆస్ట్రేలియా తరపున ఖవాజా టెస్ట్ అరంగేట్రం చేశాడు. అవకాశం వచ్చినప్పుడల్లా ఖవాజా తనను తాను నిరూపించుకొని జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. 39 ఏళ్ళ ఈ ఆసీస్ ఓపెనర్ ఓవరాల్ గా 87 టెస్టులు ఆడాడు. 43.39 యావరేజ్ తో 6206 పరుగులు చేశాడు. వీటిలో 16 సెంచరీలు.. 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన తొలి టెస్ట్ సిడ్నీలో ఆడిన ఖవాజా.. చివరి టెస్ట్ కూడా అక్కడే ఆడుతుండడం విశేషం.