కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో 20 మంది సిబ్బందికి కరోనా

కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో 20 మంది సిబ్బందికి కరోనా

హైద‌రాబాద్ : న‌గ‌రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ‌వంద‌ల సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతుండ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో కూడా క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతుండ‌టం తీవ్ర క‌ల‌క‌లం రేపుతుంది. సోమ‌వారం ఒక్క‌రోజే జిహెచ్ఎమ్‌సి ప‌రిధిలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో 20 కి పైగా కేసులు న‌మోద‌య్యాయి.

జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్యాలయంలో 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పారిశుద్ధ్య సిబ్బంది, ఎంటమలజీతో కలిపి మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్టు అధికారులు తెలిపారు. మిగతా వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించారు. కార్యాలయాన్ని సిబ్బంది శానిటైజేష‌న్ చేశారు.

సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ లోని ఇంజినీరింగ్ విభాగం లో ఒక‌ వ్యక్తికి కరోన సోకింది. హైదరాబాద్ కలెక్టరేట్‌లో కూడా కరోన కలకలం రేగింది.ఒక వ్యక్తికి కరోన పాజిటివ్ రావడంతో కలెక్టరేట్ ఆఫీస్‌ను శానిటైజ్ చేయాలని అధికారులు అదేశించారు.