మే ఐ హెల్ప్​యూ? మడుగులో పడిపోయాడని చేయందించిన ఓరాంగుటన్​

మే ఐ హెల్ప్​యూ? మడుగులో పడిపోయాడని చేయందించిన ఓరాంగుటన్​

తోటి వాళ్లకే ఆపదొస్తే పట్టించుకోని మనుషులున్న ఈ రోజుల్లో మనిషికి ఆపదొచ్చిందని ఓ మూగ జీవి సాయం చేసింది. మనసును కదిలించేలా ఉన్న ఈ ఫొటోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్​గా మారాయి. 

మనుషుల్లో మానవత్వాన్ని తట్టి లేపేలా ఉన్నా ఈ దృశ్యాలకు సంబంధించిన వార్తే ఇది.. ఇండోనేసియాలోని ఒరాంగుటన్​ సర్వైవల్​ఫౌండేషన్​కి చెందిన ఓ సంరక్షకుడు పాములు పట్టుకునేందుకు ఓ అడవిలోని మడుగులోకి దిగాడు. 

అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఓరాంగుటన్(కోతి జాతుల్లో రకం) అతను మడుగులో మునిగిపోతున్నాడని భావించింది. వెంటనే మడుగు దగ్గరకు వచ్చి ఆ సంరక్షకుడికి తన చేతిని అందించింది. దాని చేతి సాయంతో అతను ఒడ్డుకు చేరుకున్నాడు. 

ఒరాంగుటన్ చేయి అందిస్తున్న దృశ్యాన్ని టూరిస్ట్​ అనిల్​ ప్రభాకర్​ఫొటో తీశారు.  మనిషిని కాపడటానికి 'మే ఐ హెల్ప్​యూ' అనేలా చేయి అందిస్తున్న ఆ మూగ జీవిని చూస్తే జంతువుల్లో మనుషుల కంటే ఎక్కువ మానవత్వం ఉందని అనిపించిందని ఇంతకు మించి ఉదాహరణ ఇంకేం కావాలని ఆయన అన్నారు. 

ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి.