లాక్‌డౌన్ రిలీఫ్: సిటీ రోడ్లపై గంటకు 40 వేల వాహనాలు

లాక్‌డౌన్ రిలీఫ్: సిటీ రోడ్లపై గంటకు 40 వేల వాహనాలు

లాక్డౌన్ సడలింపులతో హైదరాబాద్‌లో  ట్రాఫిక్ బాగా పెరిగింది.  గత రెండు రోజుల నుంచి పబ్లిక్ చాలా ఎక్కువగా రోడ్ల మీదకు  వస్తున్నారు. రెండు నెలలుగా ఖాళీగా ఉన్న రోడ్లు.. ఇప్పుడు వాహనదారులతో నిండిపోయాయి. మొన్నటి వరకు ఎక్కడా కూడా సిగ్నల్ పడలేదు. కానీ, ఇప్పుడు ట్రాఫిక్ పెరగడంతో సిగ్నల్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. రెండు నెలలకు పైగా చెక్ పోస్టుల  దగ్గర డ్యూటీలు చేసిన పోలీసులు.. ఇప్పుడు ట్రాఫిక్ మూమెంట్ పై  ఫోకస్ పెట్టారు.

ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులివ్వడంతో  సిటిలో ప్రైవేట్ వెహికిల్స్, క్యాబులు, ఆటోలకు పర్మిషన్ ఇచ్చారు. దాంతో మంగళవారం ఒక్క రోజే 4 లక్షల 50 వేల వాహనాలు రోడ్డెక్కాయి. లాక్డౌన్‌కు ముందు ప్రతి రోజు 7 లక్షల 50 వేల వాహనాలు రోడ్లపై తిరిగితే… ఇప్పుడు మాత్రం 70 శాతం వెహికిల్స్ రోడ్ల మీదకు వస్తున్నాయి.

పోలీసులు బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ట్రాఫిక్ మూమెంట్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ జాం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సిటిలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటలకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గంటకు 40 వేల వెహికిల్స్ తిరిగినట్లు గుర్తించారు. మెహిదీపట్నం, పంజాగుట్ట, లక్డికపూల్, అమీర్ పేట్, బేగంపేట్, సికింద్రాబాద్, హైటెక్ సిటి, మాదాపూర్, ఎల్బీనగర్,  ఎస్ఆర్ నగర్ ఏరియాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్నారు. అయితే కొన్ని ఏరియాల్లో రోడ్డు పనులు జరుగుతుండటంతో ఎక్కువగా ట్రాఫిక్ జాం అవుతునట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చిన వెహికిల్స్‌ను ఆపి సంబంధించిన పత్రాలు, పెండింగ్ చలాన్లు చెక్ చేస్తున్నారు. ఏ ఒక్కటి లేకపోయినా కేసులు నమోదు చేసి చలాన్లు వేస్తున్నారు.

వాహనదారులు బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటున్నారు. మాస్క్ పెట్టుకోకపోతే కేసు నమోదు చేసి, 1000 రూపాయల పైన్ వేస్తామని హెచ్చరిస్తున్నారు. సిటిలో ఇప్పటివరకు 16 వేలకి పైగా మాస్క్ లేని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆటోలో డైవర్‌తో పాటు ఇద్దరికి, క్యాబ్‌లో ముగ్గురికి మాత్రమే ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆటో, క్యాబ్‌లలో అనుమతికి మించి ఎక్కువ మందిని ఎక్కించుకుంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్ రూల్స్ పాటించాలని కోరుతున్నారు.

For More News..

కరోనా మందు పేరుతో భార్య బాయ్ ఫ్రెండ్ కుటుంబంపై హత్యాయత్నం

వీడియో వైరల్: బెంగళూరులో వింత సప్పుడు

సిమ్ బ్లాక్ అయితదంటూ స్కూల్ టీచర్ కు ఫోన్ చేసి..