ప్రియుడి కోసం మూడేళ్ళ కూతుర్ని చంపిన తల్లి

V6 Velugu Posted on Jun 03, 2021

విశాఖ జిల్లా మధురవాడ సమీపంలోని మారికవలసలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని మూడేళ్ల చిన్నారిని సొంత తల్లే చంపింది. ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా ఊరి చివరన ఉన్న శ్మశానవాటికలో అంత్యక్రియలు కూడా చేసింది. చిన్నారి కనిపించకపోవడంతో స్థానికులు నిలదీశారు. నిందితురాలు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి తల్లిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమక్షంలోనే స్థానికులు ఆ తల్లిపై దాడికి పాల్పడ్డారు. నిందితురాలిని తమకు అప్పగించాలంటూ పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Tagged andhrapradesh, illegal affair, madhurawada, Vishakapatnam, marikavalasa, mother killed her daughter

Latest Videos

Subscribe Now

More News