
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. తాను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మోత్కుపల్లి నర్సింహులును ఆయన నివాసంలో కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. మోత్కుపల్లి కూడా త్వరలో బీజేపీలో చేరుతానని తమకు హామీ ఇచ్చినట్లు చెప్పారు లక్ష్మణ్. మోత్కుపల్లి బీజేపీలో చేరితే తెలంగాణలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. టీఆర్ఎస్ అవినీతి, అరాచక పాలనపై తమ పోరును మరింత ఉదృతం చేస్తామన్నారు లక్ష్మణ్.
నేను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి మాజీమంత్రి శ్రీ మోత్కుపల్లి నరసింహులును వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాము. ఈ సందర్భంగా బిజెపిలో చేరాల్సిందిగా వారిని ఆహ్వానించాము. మా ఆహ్వానానికి వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే బిజెపిలో చేరుతానని హామీ ఇచ్చారు. pic.twitter.com/QPZNdQb5XW
— Dr K Laxman (@drlaxmanbjp) August 10, 2019