అగ్ని పర్వతం పేలిన ఘటన.. మృతులు 23 మంది

అగ్ని పర్వతం పేలిన ఘటన.. మృతులు 23 మంది
  • డెడ్​ బాడీలను గుర్తించిన రెస్క్యూ టీమ్​

జకర్తా: ఇండోనేషియాలోని మరాపి అగ్ని పర్వతం బద్దలైన ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. ఆదివారం జరిగిన పేలుడు ధాటికి తొలుత 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన 12 మంది కోసం సెర్చింగ్ కొనసాగిస్తుండగా ఆ పన్నెండు మంది డెడ్ ​బాడీలను మంగళవారం కనుగొన్నట్లు ప్రకటించారు. వాళ్ల మృతదేహాలను ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. సుమత్రా దీవిలోని 2,891 మీటర్ల ఎత్తున్న మరాపి పర్వతాన్ని అధిరోహించేందుకు 75 మంది మౌంటెనీర్లు ఆదివారం బయల్దేరారు.

వీళ్లంతా ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో సోమవారం ఉదయం అగ్ని పర్వతం బద్దలైంది. దీంతో 3 కిలోమీటర్లు ఎత్తుదాకా బూడిద వ్యాపించింది. దుమ్ము, ధూళితో కూడిన వేడి శిథిలాలు చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరందాకా పడ్డాయి. ఆ సమయంలో బిలానికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న ఈ 23 మంది ప్రాణాలు కోల్పోగా అధికారులు 50 మందికి పైగా మౌంటెనీర్లను కాపాడారు.