కేసీఆర్‌కు కేటీఆరే వెన్నుపోటు పొడుస్తడు

కేసీఆర్‌కు కేటీఆరే వెన్నుపోటు పొడుస్తడు

హుజురాబాద్‌లో  బీజేపీ విజయంతో ఈ రోజు నుంచి కేసీఆర్, టిఆర్ఎస్ పతనం  మొదలైందన్నారు  ఆ పార్టీ ఎంపీ అర్వింద్. హుజురాబాద్ ఎన్నికలతో కేసీఆర్ శకం ముగిసిందన్నారు. కేసీఆర్‌కు కేటీఆరే  వెన్నుపోటు పొడవబోతున్నారన్నారు. టీఆర్ఎస్ అస్తవ్యస్తం కాబోతుందన్నారు. డబ్బుతో గెలవాలనుకున్న కేసీఆర్ కి హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కెసిఆర్ కి ఇవే ఆఖరి ఎన్నికలన్నారు. కేటీఆర్ తన తండ్రిని పక్కన పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారన్నారు.  దళిత బంధు అమలు చేయకపోతే హుజురాబాద్ ఫలితాలు తెలంగాణ వ్యాప్తంగా రిపీట్ అవుతాయన్నారు. ఇప్పటికైన కేసీఆర్ రాజీనామా చేసి దళితుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలన్నారు.