ఫ్యాక్టరీ పెట్టాలంటే కమీషన్లు అడుగుతుండ్రు: అర్వింద్

ఫ్యాక్టరీ పెట్టాలంటే కమీషన్లు అడుగుతుండ్రు: అర్వింద్
  • పసుపు ధర రూ.20 వేలు దాటిస్త
  • కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్

జగిత్యాల: రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టాలంటే  బీఆర్ఎస్​లీడర్లు​కమీషన్లు అడుగుతున్నారని కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం సత్తెక్కపల్లిలో నిర్వహించిన రోడ్ షో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టాలంటే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కల్వకుంట్ల కవిత కమీషన్లు అడుగుతున్నరు. తెలంగాణలోనే కాదు.. ఢిల్లీలో కూడా కవిత లిక్కర్ దందా చేస్తోంది.

రాష్ట్రంలో పంట నష్టపోతే కేసీఆర్​ఒక్కసారన్న పరిహారం ఇచ్చిండా? ఐదేండ్లలో నాపై ఒక్క అవినీతి ఆరోపణైనా ఉందా. జిమ్మేదారు ప్రభుత్వం ఉంటేనే ప్రజల సమస్యలు తీరుతాయి. పసుపు బోర్డు ఆఫీసు త్వరలో తెరుస్తరు. నాకు ఏడాది టైమియ్యండి. పసుపు ధర 20 వేలు దాటిస్తా.  బీజేపీ వస్తే పింఛన్ ఆగుతాయని ఎవరైనా అంటే చెప్పుతో కొట్టండి. మహిళలు బాగా ఆలోచించి ఓటు వేయాలి’ అని కోరారు.