మై హోమ్ సంస్థ అక్రమ మైనింగ్ పై నోరు విప్పని సీఎస్

మై హోమ్ సంస్థ అక్రమ మైనింగ్ పై నోరు విప్పని సీఎస్

మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద పసుపు రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్స్ పంపాలన్నారు అరవింద్. శుక్రవారం సీఎస్ సోమేష్ కుమార్ ను BRK భవన్ లో కలిసి లెటర్ అందించారు అరవింద్. కోల్డ్ స్టోరేజ్ ల కోసం కేంద్రం రాష్ట్రాలకు లక్ష కోట్లు కేటాయించిందన్నారు. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మై హోమ్ సంస్థ పై ఎంపీ అరవింద్

మై హోమ్ సంస్థ  మైనింగ్ లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు అరవింద్. రిజర్వ్ ఫారెస్ట్ లో మైనింగ్ చేస్తోందని..నల్గొండ జిల్లాలో మరో 600 ఎకరాల్లో అక్రమ మైనింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం మై హోమ్ సంస్థకు సహకరిస్తుందన్నారు. ఈ విషయాన్ని సీఎస్ సోమేష్ కుమార్ కు వారం క్రితం లెటర్ లో వివరించానని..ఇప్పుడు కూడా మరోసారి గుర్తు చేశానన్నారు. మై హోమ్ సంస్థ అక్రమ మైనింగ్ కు  పాల్పడుతోందని కేంద్ర ప్రభుత్వం,  రాష్ట్ర CS  సోమేశ్ కుమార్ కు మూడు లేఖలు రాసిందని.. దీనిమీద సమాధానాన్ని అడిగిందన్నారు. అయినా  రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం అడిగిన వివరాలకు సమాధానం ఇవ్వలేదన్నారు.