నన్ను బెదిరించింది.. కవితపై చర్యలు తీసుకొండి : ఎంపీ అర్వింద్

నన్ను బెదిరించింది.. కవితపై చర్యలు తీసుకొండి : ఎంపీ అర్వింద్

ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎంపీ ధర్మపురి అర్వింద్ హైకోర్టును ఆశ్రయించారు. తనను చంపుతానని మీడియా సాక్షిగా బెదిరించిన కవితపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. తనను బెదిరించడంతో పాటు తన కుటుంబసభ్యులను అవమానించిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.ఈ పిటిషన్ ను జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించనుంది. అర్వింద్ తరఫున అడ్వొకేట్ రచన రెడ్డి వాదనలు వినిపించనున్నారు. 

ఈ నెల 18న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నానంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే... నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా వెంటాడి ఓడిస్తామని హెచ్చరించారు. అర్విందే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నాడని చెప్పారు. ఓ ఆడబిడ్డపై అర్వింద్ ఇలా మాట్లాడటమేంటని ప్రశ్నించిన కవిత అర్వింద్ ఇంకోసారి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కొట్టి చంపుతామని హెచ్చరించారు.