ఎంఐఎం గుండాలకు గుణపాఠం తప్పదు

ఎంఐఎం గుండాలకు గుణపాఠం తప్పదు

ఆదివారం జ‌రిగిన సీఎం క్యాబినెట్ పై రైతులకు ఎంతో ఆశ ఉండే…కానీ ఆశ నిరాశ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్ అన్నారు. అకాల వర్షాల‌తో రైతులు నష్టపోతే క్యాబినెట్ లో కనీసం రైతుల ప్రస్తావన తేలేద‌ని, వారికి భరోసా ఇవ్వలేక పోయార‌ని సీఎం ను విమ‌ర్శించారు. పిడుగు పాటు తో రైతులు మృతి చెందారని, అకాల వర్షాలతో చాలా పంటలు నష్టపోతే సీఎం వారిని పరామర్శించలేదన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం టైమ్ పాస్ పాలిటిక్స్ చేస్తుందని, త‌మ‌ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కరోనా పై మాట్లాడుతున్నారని సంజ‌య్ ఆరోపించారు. రైతులు లాభం కోసం వ్యవసాయం చేయడం లేదని , కేవలం కుటుంబ పోషణ కోసం, జీవనం కోసం వ్యవసాయం చేస్తున్నారని ఆయ‌న‌ చెప్పారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు. రైతులకు భరోసా కల్పించేందుకు పంటలు నష్టపోయిన ప్రాంతాలను పర్యటించామ‌న్నారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో సైతం అఖిలపక్షం ఏర్పాటు చేసి కరోనా పై చర్చించాలన్నారు సంజ‌య్. ప్రభుత్వం తాము ఇచ్చే సూచనలను విమర్శలుగా చూస్తున్నార‌ని, వాటిని సలహాలు, సూచనలుగా పరిగణించాలని కోరారు. కరోనా పై ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరిచాలన్నారు.

బైంసా బాధితులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు బండి సంజ‌య్. బైంసా లో జ‌రిగిన విధ్వంస‌కాండ‌లో అమేడా రాజును హత్య చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. నిత్యం కూలీ చేసుకొని జీవనం గడిపే రాజును హత్య చేయడం సిగ్గుచేటని, హత్య చేసిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. హిందువుల పై దాడి జరిగినా.. ఏ రాజకీయ పార్టీ స్పందించిక పోవడం బాధాకర‌మ‌న్నారు. ప్రభుత్వం, పోలీసులు వెంటనే ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని, హత్య చేసిన వారిపై హత్య కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పారు. మూడు నెలలు మృత్యువుతో పొరాడి వీర మరణం పొందిన అమేడా రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు సంజ‌య్. ఎంఐఎం,టీఆర్ఎస్ రెండు ఒక్కటేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుతం అండదండలతోనే ఎంఐఎం రెచ్చిపోతోందని, హత్య చేసిన ఎంఐఎం గుండాలకు గుణపాఠం తప్పదని హెచ్చ‌రించారు. తాము ముస్లింలకు, ఇస్లాంలకు వ్యతిరేకం కాదని చెప్పారు ఎంపీ.

mp bandi sanjay warned mm on a murder case in bhainsa