ఇనాం, మాఫీ ఇనాం భూముల్లో జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫాంహౌస్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఇనాం, మాఫీ ఇనాం భూముల్లో జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫాంహౌస్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • 2009లో రూ.12 లక్షల ఆస్తులని ఎన్నికల అఫిడవిట్
  •     ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన ఫాంహౌస్​లు  
  •     బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో ఫాంహౌస్ కల్చర్ 
  •     మిక్సాలజిస్ట్ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఇన్ని ఆస్తులెట్లొచ్చినయ్
  •     ఉద్యమకారులు జయశంకర్, గద్దర్ ఏం సంపాదించారు?
  •     జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఫాంహౌస్ సందర్శనలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

చేవెళ్ల, వెలుగు: కేసీఆర్ సన్నిహితుడు, మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి ఇనాం, మాఫీ ఇనాం భూముల్లో అక్రమంగా ఫాంహౌస్​ నిర్మించుకున్నారని ఎంపీ చామల కిరణ్​కుమార్​రెడ్డి ఆరోపించారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.12 లక్షల ఆస్తులు మాత్రమే చూపించిన మిక్సాలజిస్ట్ జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డికి ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన భూములు, ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎట్లొచ్చాయని ప్రశ్నించారు. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హయాంలోనే రాష్ట్రంలో ఫాంహౌస్ కల్చర్ పెరిగిందని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఆయనను చూసి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వారిని చూసి జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, పైలట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి తదితరులు ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కట్టుకున్నారని ఆరోపించారు. అది కూడా తన నియోజకవర్గంతో సంబంధం లేకుండా శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో జగదీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇంతటి ఆస్తులు ఎలా సంపాదించారని నిలదీశారు. 

ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పనిచేసిన అంజయ్య లాంటి వారికి లేని ఆస్తులు, ఫాంహౌస్‌‌లు మీకెలా వచ్చాయని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌‌ మండలం మద్దూరు గ్రామంలోని సర్వే నంబర్లు 162, 223లో దాదాపు 50 ఎకరాల భూములు, ఫాంహౌస్‌‌ను కాంగ్రెస్‌‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల బృందం సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌కుమార్‌‌రెడ్డి మాట్లాడుతూ.. ఇనాం, మాఫీ ఇనాం భూముల్లో జగదీశ్‌‌రెడ్డి ఫాంహౌస్‌‌ ఉందని, అందులో పేదలకు చెందాల్సిన భూములు ఉంటే వారికి పంచాలని సీఎంను కోరారు. 

గద్దర్‌‌, జయశంకర్‌‌ ఏం సంపాదించారు?

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు తమ ఆస్తులు కోల్పోయారని, మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గద్దర్‌‌, ప్రొఫెసర్‌‌ జయశంకర్‌‌, కోదండరాం ఏం సంపాదించుకున్నారని చామల ప్రశ్నించారు. సూర్యాపేటలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్‌‌ కుటుంబం ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుందని,  ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి ఇప్పటికీ ఊర్లోనే ఉంటోందని గుర్తుచేశారు. పెద్ద దొరకు సోడా, వాటర్ మిక్సింగ్‌‌ చేసినవాళ్లు మాత్రం పదవులు పొంది కోట్ల రూపాయలు సంపాదించారని విమర్శించారు. కేసీఆర్‌‌ కుటుంబం తొమ్మిది జిల్లాలు, 24 మండలాలు, 33 గ్రామ పంచాయతీల పరిధిలో 400 ఎకరాలకు పైగా భూములు ఆధీనంలో పెట్టుకున్నదని చామల మండిపడ్డారు. నిజాం నవాబు 200 ఏళ్లలో కూడబెట్టిన ఆస్తుల కంటే కేసీఆర్‌‌ కుటుంబం పదేళ్లలో ఎక్కువ ఆస్తులు సంపాదించిందని ఆరోపించారు. బీఆర్‌‌ఎస్‌‌ నేతల పేర్లపై ఫాంహౌస్‌‌లు, వారి అనుచరుల పేర్లపై వందల ఎకరాల భూములు ఉన్నాయని, జగదీశ్‌‌రెడ్డి ఫాంహౌస్‌‌లో ఇనాం భూములు ఉంటే  పేదలకు పంచాలని సీఎంను కోరారు. 

కాంగ్రెస్ అసైన్డ్ భూములు పంచింది 

షాద్‌‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను, కవులను పట్టించుకోలేదని మండిపడ్డారు.  ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌‌గా పనిచేసిన కోదండరాంను అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ అరెస్ట్​ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్ దేశంలో అసైన్డ్​ భూములతో పాటు, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆ భూములను కూడా  పేదలకు పంచిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ మాత్రం దోచుకుతిన్నదని ఆరోపించారు. ఎంపీలు సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ ప్రభుత్వ విప్‌‌లు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్య, శాసన మండలి ప్రభుత్వ విప్‌‌లు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, మందుల సామేల్, బాలు నాయక్, నవీన్ యాదవ్, పార్టీ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

జగదీశ్‌‌రెడ్డి ఆధీనంలో ఇనాం భూములు

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. హరీశ్​రావు రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు మధ్యలో అసైన్డ్ భూమిలో, కేటీఆర్ జన్వాడలో ఓ కంపెనీ భూముల్లో, పైలట్ రోహిత్ రెడ్డి అజీజ్‌‌నగర్లో అసైన్డ్ భూముల్లో ఫాంహౌసులు కట్టుకుంటే.. జగదీశ్ రెడ్డి ఇనాం, మాఫీ ఇనాం భూముల్లో ఫాంహౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. జగదీశ్ రెడ్డికి చెందిన 50 ఎకరాల్లో  పేదలకు చెందాల్సిన 12 ఎకరాల ఇనాం, మాఫీ ఇనాం భూములు ఉన్నాయన్నారు.