12 ఏండ్ల మోదీ పాలనతో దేశంలో చరిత్రాత్మక పురోగతి : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

12  ఏండ్ల మోదీ పాలనతో దేశంలో చరిత్రాత్మక పురోగతి : ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్

 పద్మారావునగర్, వెలుగు: ప్రధాని మోదీ 12 ఏండ్ల పాలనలో దేశం సంక్షేమం, మౌలిక సదుపాయాలు, మహిళా సాధికారతలో చరిత్రాత్మక పురోగతి సాధించిందని ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రశంసించారు. హైదరాబాద్ కవాడిగూడలో శనివారం  ప్రెస్​ ఇన్ఫర్మేషన్​ బ్యూరో(పీఐబీ) నిర్వహించిన  వార్త మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వ పారదర్శక పథకాల వల్ల గత దశాబ్ద కాలంలో దేశంలో సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.రాష్ట్రంలో రూ. 1.20 లక్షల కోట్లతో 5 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు.  

సీనియర్ జర్నలిస్టు కస్తూరి రాకా సుధాకర్ రావు మాట్లాడుతూ.. 'మన్ కీ బాత్' డిజిటల్ వేదికల ద్వారా ప్రధాని మోదీ ప్రజలతో ప్రత్యక్షంగా అనుసంధానమయ్యారని తెలిపారు. పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాల పెంపు కోసమే దేశవ్యాప్తంగా పీఐబీ ఇంటరాక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. అనంతరం ప్రధానిగా  మోదీ  12  ఏండ్ల పాలనపై తెలుగులో అనువాదం చేసిన బుక్స్​ను ఎంపీ లక్ష్మణ్​ ఆవిష్కరించారు.