పద్మారావునగర్: గాంధీ మెడికల్ కాలేజీ ఏడీగా శ్రీనివాస్

పద్మారావునగర్: గాంధీ మెడికల్ కాలేజీ ఏడీగా శ్రీనివాస్

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్​గా జి.శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆరేండ్లు ఆయన నల్గొండ మెడికల్ కాలేజీ ఏడీగా పని చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమయపాలన, చిత్తశుద్ధితో పనిచేస్తూ కళాశాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ముగిసిన క్యాన్సర్ నిర్ధారణ సదస్సు

సికింద్రాబాద్​గాంధీ మెడికల్ కాలేజీ, టాటా మెమోరియల్ ట్రావెలింగ్ స్కూల్ ఆఫ్ ఆంకో పాథాలజీ సంయుక్తంగా నిర్వహించిన మూడు రోజుల రాష్ట్రస్థాయి క్యాన్సర్ నిర్ధారణ సదస్సు శనివారం ముగిసింది. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్​ఇందిర, సూపరింటెండెంట్ ప్రొఫెసర్​వాణి మాట్లాడుతూ.. ఇలాంటి సదస్సులు డాక్టర్లు, స్టూడెంట్లకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన పెంచుతాయని తెలిపారు. డాక్టర్ సుమిత్ గుజ్రాల్ నేతృత్వంలోని బృందం ప్రజెంటేషన్​ఇవ్వగా.. రాష్ట్రం నుంచి సుమారు 250 మంది వైద్యులు, విద్యార్థులు హాజరయ్యారు.