ఇవాళ (జూన్ 21) శ్రీలంక - ఎ తో ఇండియా - ఎ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీపైనే దృష్టి

ఇవాళ (జూన్ 21) శ్రీలంక - ఎ తో ఇండియా - ఎ ఫైనల్.. వైభవ్ సూర్యవంశీపైనే దృష్టి

దంబుల్లా: ముక్కోణపు వన్డే సిరీస్‌‌‌‌ ఫైనల్‌‌‌‌కు ఇండియా–ఎ జట్టు రెడీ అయ్యింది. నేడు జరిగే టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో శ్రీలంక–ఎతో తలపడనుంది. ఇందులో గెలిచి గత మ్యాచ్‌‌‌‌ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని మన కుర్రాళ్లు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కీలక మ్యాచ్‌‌‌‌లో అందరి దృష్టి వండర్‌‌‌‌ కిడ్‌‌‌‌ వైభవ్‌‌‌‌ సూర్యవంశీపైనే నెలకొని ఉంది.

ఐపీఎల్‌‌‌‌లో పరుగుల సునామీ సృష్టించిన వైభవ్‌‌‌‌.. లంక పిచ్‌‌‌‌లపై ఇబ్బందిపడుతున్నాడు. కెప్టెన్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మ, రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌, ప్రియాన్షు ఆర్యా, కుమార్‌‌‌‌ కుశాగ్ర బ్యాటింగ్‌‌‌‌లో కీలకం కానున్నారు. స్పిన్నర్లు నిషాంత్‌‌‌‌ సంధు, అనుకూల్‌‌‌‌ రాయ్‌‌‌‌తో పాటు అర్షద్‌‌‌‌ ఖాన్‌‌‌‌, యష్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌పై బౌలింగ్‌‌‌‌ భారం పడనుంది.

మరోవైపు ఓపెనర్‌‌‌‌ అవిష్క ఫెర్నాండోపైనే లంక జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. రెండు సెంచరీలతో అతను టాప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. బౌలింగ్‌‌‌‌లో మథులాన్‌‌‌‌ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది.