కామారెడ్డి: రైలులో తరలిస్తున్న 20 కిలోల గంజాయి పట్టివేత

కామారెడ్డి: రైలులో తరలిస్తున్న  20 కిలోల గంజాయి పట్టివేత

కామారెడ్డి టౌన్, వెలుగు: ఒడిశా నుంచి మహారాష్ట్రకు రైలులో తరలిస్తున్న 20 కిలోల ఎండు గంజాయిని కామారెడ్డి జిల్లా ఎక్సైజ్​పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్​ సూపరింటెండెంట్​హన్మంత్​ రావు వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో శనివారం ఒడిశాలోని సంబల్​పూర్​ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్​కు వెళ్తున్న నాగవల్లి ఎక్స్​ప్రెస్​లో ఎక్సైజ్, రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

ఎస్​7 బోగీలో బెర్తు కింద దాచిన ప్యాకెట్లను తనిఖీ చేయగా 20 కిలోల గంజాయి పట్టుబడింది. రవాణా చేస్తున్న నిందితుడు తప్పించుకున్నాడు. అతడి కోసం గాలింపులు చేపట్టారు.