మల్కాజిగిరిలోని స్కూల్ ఫీజు 20 శాతం పెంచారని ధర్నా

 మల్కాజిగిరిలోని స్కూల్ ఫీజు 20 శాతం పెంచారని ధర్నా

మల్కాజిగిరి, వెలుగు: మల్కాజిగిరిలోని సెయింట్ మార్టిన్స్ స్కూల్ యాజమాన్యం ఈ విద్యాసంవత్సర ఫీజును 20 శాతం పెంచిందంటూ ఏబీవీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఆ పాఠశాల ఎదుట ధర్నాకు దిగారు. వారికి మాజీ కార్పొరేటర్ శ్రవణ్ మురళి మద్దతు తెలిపారు. 

నాయకులు మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎంఈవోకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన 20 శాతం ఫీజును వెనక్కి తీసుకోవాలని డిమాండ్​చేశారు.