పీసీసీ మార్పు కేంద్ర నాయకత్వం చూసుకుంటది

పీసీసీ మార్పు కేంద్ర నాయకత్వం చూసుకుంటది

నల్గొండ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటములు సహజమన్నారు. ఢిల్లీలో రైతుల పోరాటానికి నా మద్దతు ఉందన్న ఆయన..తెలంగాణలోనూ ఢిల్లీ మాదిరిగా ఉద్యమం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సబ్సిడీలు తప్పితే  టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. సీఎం చెప్ఫిన పంటలు వేస్తే.. కొనే దిక్కేలేదని..ఎస్ ఎల్ బిసీ, బ్రహ్మాణవెల్లం ప్రాజెక్టుల పూర్తి కోసం త్వరలో ఉద్యమం చేపడతానన్నారు.

ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో దోపిడి చేస్తున్నారని.. ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా.. ఈనెల 9న ఆందోళన చేపడతామన్నారు. 57 ఏళ్ల ఫెన్షన్, నిరుద్యోగ భృతి ఏమైందన్న ఎంపీ..తండ్రీకొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. ధరణి.. తలతోకలేనీ పొగ్రామని.. నల్గొండ నియోజకవర్గంలో.. పొద్దున లేచింది మొదలు సెటిల్మెంట్లు..కాంట్రాక్టర్లను బెదిరింపులు జరుగుతున్నాయన్నారు. మరో రెండేళ్ల తర్వాత మనదే పాలన అని.. నల్గొండ దత్తత అని మాయమాటలు చెప్పిన కేసీఆర్ కు బుద్ధి ఉండాలన్నారు. జీహెచ్ఎంసీ ఫలితాలు చూసి కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దన్నారు. పీసీసీ మార్పు కేంద్ర నాయకత్వం చూసుకుంటదన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.