తిరుమల నుంచి నేరుగా విజయ్ ఇంటికి త్రిష

తిరుమల నుంచి నేరుగా విజయ్ ఇంటికి త్రిష

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది.50 ఏళ్ల ద్రావిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి బ్రేక్ వేస్తూ.. దళపతి విజయ్ అరంగేట్రం చేసిన తొలి ఎన్నికల్లోనే టీవీకే (TVK) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం విజయ్ పార్టీ ఏకంగా 108 స్థానాల్లో ముందంజలో ఉంటూ.. మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది. 

అయితే ఈ రాజకీయ ఉత్కంఠ మధ్య సినీ నటి త్రిష వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇవాళ తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష.. సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం ముగిసిన వెంటనే ఆమె నేరుగా చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్న వీడియోలు ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ALSO READ : మ్యాజిక్ ఫిగర్‎కు దగ్గరగా ఆగుతున్న విజయ్ టీవీకే

మరోవైపు చెన్నైలోని నీలాంకరైలో ఉన్న విజయ్ నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. తన పార్టీ ఘనవిజయం దిశగా వెళ్తుండటంతో.. విజయ్ స్వయంగా ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. అభిమానుల కోలాహలం, ఈలలు, గోలల మధ్య విజయ్ చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో విజయ్ నివాసం ,పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయాయి.