‘ఎమర్జెన్సీ’ టైమ్​ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు

‘ఎమర్జెన్సీ’ టైమ్​ ప్రజాస్వామ్యానికి చీకటి రోజులు

బషీర్ బాగ్/నేరేడ్​మెట్/షాద్​నగర్, వెలుగు: ఇందిరా గాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీ టైమ్​ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బర్కత్​పురాలోని బీజేపీ ఆఫీసులో ఆదివారం ఏర్పాటు చేసిన ‘యాంటీ ఎమర్జెన్సీ డే’లో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్​హయాంలో11 నెలల ఎమర్జెన్సీ పౌరుల హక్కులను కాలరాసిందని, పత్రికా స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. జయప్రకాశ్​నారాయణ నేతృత్వంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటాలు చేశారని గుర్తుచేశారు.

రాహుల్ గాంధీకి బీజేపీని విమర్శించే హక్కుఉందా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ టైమ్ లో జైలుకు వెళ్లిన పలువురిని ఈ సందర్భంగా లక్ష్మణ్ సన్మానించారు. అలాగే నేరేడ్​మెట్ జీకే సరస్వతి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన యాంటీ ఎమర్జెన్సీ డేలో బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు, గుజరాత్ ఎంపీ డా.భారతీబెన్, షాద్ నగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిఖిల్ ఆనంద్ పాల్గొన్నారు.