బంగారు పూతతో కుల్ఫీ.. ధర కేవలం రూ.351 మాత్రమే

బంగారు పూతతో కుల్ఫీ.. ధర కేవలం రూ.351 మాత్రమే

కుల్ఫీ అంటే తెలియని వాళ్లుండరు. ఈ వేసవిలో అయితే మాంచి ఫ్రూట్ ట్రీట్ ను అందిస్తునడంతో ఏ మాత్రం సందేహం లేదు. మామిడి, పిస్తా, బాదం లాంటి వివిధ ఫ్లేవర్స్ లో మార్కెట్ లో లభ్యమవుతోన్న ఈ కుల్ఫీ... ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ క్లాసిక్ డెజర్ట్ కుల్ఫీ అంతగా వైరల్ కావడానికి కారణమేంటంటే... దీనికి బంగారు పూత పూయడమే.

గోల్డ్ కుల్ఫీగా పేరు తెచ్చుకున్న ఈ డెజర్ట్ కు సంబంధించిన ఓ వీడియోను ఇన్ సఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ బ్లాగర్ కలాష్ సోనీ షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండోర్‌కు చెందిన ఒక వీధి వ్యాపారి “24 క్యారెట్ల” బంగారు ఆకులో కుల్ఫీ ముక్కను చుట్టినట్లు చూపిస్తుంది. ప్రకాష్ కుల్ఫీ అని పిలవబడే ఈ విక్రేత, డెజర్ట్‌ను అందిస్తున్నప్పుడు బంగారు ఆభరణాలను ధరించాడు. షేర్ చేసిన వివరాల ప్రకారం ఈ బంగారు కుల్ఫీ ధర రూ. 351.

ఏప్రిల్ 14న షేర్ చేసిన ఈ వీడియోకు... ఇప్పటివరకు 7లక్షలకు పైగా వ్యూస్,  41వేల లైక్‌లు వచ్చాయి. ఆసక్తికరమైన ఈ వీడియోపై పలువురు నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్లు చేస్తున్నారు, కొందరు ఆశ్చర్యంగా ఉందని అంటుంటే.. మరికొందరు డబ్బు వృథా అని కొట్టిపారేశారు. తినదగిన ఈ బంగారం అసలైనది కాదని, అది అసలు "సగం క్యారెట్ కూడా ఉండదు" అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/CrBQwQDLljj/?utm_source=ig_embed&ig_rid=721ac7de-871a-41e7-974b-c73a39958d1a