విద్యుత్ సంస్థలో షరతులతో కూడిన ప్రమోషన్ లను వెంటనే నిలిపివేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు.హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని క్యాడర్ ల ప్రమోషన్ లను సమీక్షించాలని తెలిపారు.
ఉద్యోగుల సినియార్టీని మెరిట్ ప్రాతిపదికన విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 5న యాదగిరిగుట్టలో విద్యుత్ బీసీ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈ మహాసభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు.
