ముషీరాబాద్, వెలుగు: మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీలకు సబ్ కోటా కల్పించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో రాష్ట్ర బీసీ స్వరాజ్య సేవా సమితి అధ్యక్షుడిగా వంగురి శ్రీనివాస్ యాదవ్‌ను నియమిస్తూ ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. బీసీలకు సముచిత స్థానం దక్కినప్పుడే ఆ వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఈ డిమాండ్‌పై దేశవ్యాప్తంగా ఉన్న బీసీలను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
