బీహెచ్‌‌‌‌ఈఎల్ నుంచి తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌... రేడియల్ రోడ్డును కనెక్ట్ చేస్తాం:మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌రావు 

బీహెచ్‌‌‌‌ఈఎల్ నుంచి తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌... రేడియల్ రోడ్డును కనెక్ట్ చేస్తాం:మెదక్ ఎంపీ రఘునందన్‌‌‌‌రావు 

రామచంద్రాపురం, వెలుగు: బీహెచ్ఈఎల్​పరిధిలోని ఎంఐజీ కాలనీ నుంచి రేడియల్​రోడ్డు 7 కు కనెక్టివిటీ కల్పిస్తామని మెదక్​ఎంపీ రఘునందన్‌‌‌‌రావు హామీ ఇచ్చారు. తెల్లాపూర్​ పరిధిలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న రైల్వే సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఎంఐజీ కాలనీ, తెల్లాపూర్​ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలపై కాలనీ అసోసియేషన్లు, గ్రామ పెద్దలతో ఆయన సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంఐజీ నుంచి రేడియల్​ రోడ్డుకు మధ్యలో రైల్వే ట్రాక్​ ఉండటం వల్ల ఫుట్​​ ఓవర్​ బ్రిడ్జిని నిర్మిస్తామన్నారు. ఎంఎంటీఎస్​ రైల్​ సర్వీస్‌‌‌‌ను తెల్లాపూర్ ​నుంచి ఈదులనాగులపల్లి వరకు పెంచేందుకు ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఎంఐజీ నుంచి తెల్లాపూర్​ ​ వైపు రైల్వే అండర్ బ్రిడ్జి చిన్నగా ఉండటం వల్ల నిత్యం ట్రాఫిక్​ జామ్​ అవుతుందని, ఈ విషయంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్​, సహాయ మంత్రి సోమన్నతో చర్చలు జరిపి మరో ఆర్‌‌‌‌‌‌‌‌యూబీ నిర్మాణానికి అనుమతులు తెచ్చినట్లు వివరించారు. 

పెరిగిన అవసరాలకు అనుగుణంగా హైటెన్షన్ లైన్ల కింద సీవరేజ్ పైప్​ లైన్లు, తాగునీటి లైన్ల నిర్మాణాలపై అధికారులతో చర్చలు జరుపుతానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఐజీ సొసైటీ ప్రెసిడెంట్అ బ్ధుల్​అజీమ్​, జగన్మోహన్, వెంకటయ్య. ఈశ్వర్, జయలక్ష్మి, సీనియర్​నాయకులు నరేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాజు, లచ్చిరాంనాయక్​, నర్సింహారెడ్డి, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.