హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ( మే 1 ) నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచాలని.. పెన్షన్ పెరిగేవరకు పోరాడతానని అన్నారు వంశీకృష్ణ.
కాకా స్పూర్తితో కార్మికుల కోసం పోరాటం చేస్తానని అన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం మంత్రి వివేక్ పోరాడారని..4 లక్షల మంది గిగ్ వర్కర్లకు మేలు జరగనుందని అన్నారు.
పెద్దపల్లి జిల్లా ప్రజలు ఆశీర్వదించి తనను పార్లమెంట్ కు పంపించారని అన్నారు. కార్మికులకు దివంగత కాకా సేవలు చిరస్మరణీయమని.. సింగరేణి కార్మికులను కాకా ఆదుకున్నారని అన్నారు వంశీకృష్ణ. కార్మికులకు పెన్షన్ సౌకర్యం తీసుకొచ్చిందే కాకా అని అన్నారు. రాష్ట్రంలో 65 ATC సెంటర్లు ఏర్పాటు చేసుకున్నామని... ATC సెంటర్ల ద్వారా యువత స్కిల్ పెరుగుతుందని అన్నారు.
