V6 News

మిస్టర్‌‌‌‌ ఎక్స్‌‌ స్పై యాక్షన్తో థ్రిల్ చేస్తుంది

మిస్టర్‌‌‌‌ ఎక్స్‌‌ స్పై యాక్షన్తో థ్రిల్ చేస్తుంది

ఆర్య, గౌతమ్ కార్తీక్, మంజు వారియర్‌‌‌‌ లీడ్ రోల్స్‌‌లో వస్తున్న చిత్రం ‘మిస్టర్ ఎక్స్‌‌’. అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్స్‌‌గా నటించారు.  ‘ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌’ ఫేమ్ మను ఆనంద్ దర్శకుడు. ఎస్‌‌.లక్ష్మణ్‌‌ కుమార్ నిర్మించారు.  ఏప్రిల్ 17న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతున్న సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  

హీరో ఆర్య మాట్లాడుతూ ‘మూడేళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం హ్యాపీ. యాక్షన్, ఎమోషన్స్ కలగలిసి చక్కని థియేటర్‌‌‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఇచ్చే సినిమా. గౌతమ్‌‌ కొత్తగా కనిపిస్తాడు. అలాగే మంజు గారు అద్భుతమైన యాక్షన్‌‌ సీన్స్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది’ అని చెప్పాడు.  

తన కెరీర్‌‌లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదని, తప్పకుండా థియేటర్స్‌‌లో చూడాల్సిన సినిమా అని మంజు వారియర్ చెప్పారు. ఇదొక కొత్త తరహా స్పై యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ అని గౌతమ్ కార్తీక్ తెలిపాడు. ఇందులో చాలా డిఫరెంట్ పాత్ర పోషించినట్టు అతుల్య రవి చెప్పింది.

  దర్శకుడు మను ఆనంద్ మాట్లాడుతూ ‘ఇది చాలా క్లిష్టమైన కథ. అయితే నటీనటులు తమ పాత్రలను చక్కగా అర్థం చేసుకుని అద్బుతంగా నటించారు.  కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ రైడ్​ని ఎక్స్​పీరియన్స్ చేస్తారు’ అని చెప్పాడు.