ధోని మంచి ఫీల్డర్ అయ్యుండేవాడు: కైఫ్

ధోని మంచి ఫీల్డర్ అయ్యుండేవాడు: కైఫ్

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఫిట్ నెస్ తోపాటు ఫీల్డింగ్ స్టాండర్డ్స్ ను పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవాడు. ముఖ్యంగా కెప్టెన్ గా ఉన్నప్పుడు టీమ్ ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచడానికి యత్నించాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్ చివరి రోజుల్లో కూడా దీన్నే పాటించాడు. తన కంటే వయస్సులో చాలా చిన్నోడైన హార్దిక్ పాండ్యాను స్ప్రింట్ రేసులో ఓడించడమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఇక ధోని కీపింగ్ సామర్థ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు.

ధోని ఫీల్డింగ్ గురించి ఇండియన్ క్రికెట్ లో బెస్ట్ ఫీల్డర్ గా చెప్పుకొనే మహ్మద్ కైఫ్ పలు విషయాలు చెప్పాడు. ధోని తలచుకుంటే మంచి ఫీల్డర్ అయ్యుండేవాడని పేర్కొన్నాడు. ధోని ఫీల్డింగ్ కు సంబంధించి ఓ వీడియోను కైఫ్ షేర్ చేశాడు. ఈ వీడియోలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భజ్జీ బౌలింగ్ లో బ్యాట్స్ మన్ రన్ కు యత్నించాడు. ముందుకు పరుగెత్తుకొచ్చిన ధోని బాల్ ను కీపింగ్ ఎండ్ లో విసరగా, కైఫ్ రనౌడ్ చేశాడు. ‘మైదానంలో ఎక్కడ ఫీల్డింగ్ చేసినా ధోని మంచి ఫీల్డర్ అయ్యేవాడు. అలాగే నేనూ బ్యాడ్ కీపర్ కాకపోయేవాడ్ని’ అని కైఫ్ ట్వీట్ చేశాడు.