పంటల సాగు ఖర్చుకు 50% అదనంగా ఎంఎస్పీ ఇవ్వాలె

పంటల సాగు ఖర్చుకు 50% అదనంగా ఎంఎస్పీ ఇవ్వాలె

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంటల సాగు ఖర్చు బాగా పెరిగింది. ఎకరా వరి పండించేందుకు నిరుడు రూ.35  వేల ఖర్చయితే ఈసారి అది రూ.38 వేలకు పెరిగింది. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలకూ ఖర్చులు పెరిగాయి. కూలీల కొరతతో కూలీ రేట్లు పెరిగాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. ట్రాక్టర్, వరికోత మెషీన్లు, ఇతర మెషీన్ల రేట్లు కూడా పెరిగాయని తెలిపింది. డీజిల్, సీడ్స్, ట్రాన్స్​పోర్ట్, ఫెర్టిలైజర్, రేట్లు పెరిగాయి. వీటివల్ల ఏటా సాగు ఖర్చు పెరుగుతోందని వ్యవసాయ శాఖ ఈ మేరకు గురువారం కమిషన్ ఫర్ ​అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ​ప్రైసెస్ (సీఏసీపీ)కు రిపోర్టు ఇవ్వనుంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్​లలో ఆయా రాష్ట్రాలలో ప్రధాన పంటలు, ఖర్చులు, స్టేట్ గవర్నమెంట్లు ప్రపోజ్ చేసే ఎంఎస్పీవివరాలను సీఏసీపీ సేకరిస్తుంది. వీటన్నింటిపై రివ్యూ చేసి ఎంఎస్పీని పెంచుతుంది.