కారేపల్లి/ తాడ్వాయి/ వెంకటాపురం, వెలుగు: వేర్వేరుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లికి చెందిన వజ్జా సునీల్ఆటో నడుపుకుంటూ గ్రామంలోని ఓ వీధిలోకి వెళ్లాడు. స్థానికంగా ఉన్న చెట్టుకింద ఆరో తరగతి చదువుతున్న యశ్వంత్, స్నేహిత్, భరత్, చిట్టు, తేజ, ప్రవీణ్ విద్యార్థులు ఆటుకుంటున్నారు. సునీల్ అక్కడే ఆటో నిలిపి సరదాగా వెళ్లివద్దామంటూ విద్యార్థులను ఎక్కించుకున్నాడు. జమాలపల్లి రోడ్డులో కొంత దూరం వెళ్లిన తర్వాత ముందుకు కూర్చున్న ఓ విద్యార్థికి ఆటో ఇచ్చి నడపమన్నాడు.
ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఆరుగురు విద్యార్థులతోపాటు డ్రైవర్ సునీల్ గాయపడ్డారు. వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా, సునీల్ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్నాడని గ్రామస్తులు తెలిపారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం నుంచి కాటాపూర్ వెళ్తున్న గాందెర్ల రమేశ్ ఆటోలో రంజిత్అనే వ్యక్తితోపాటు గ్రామానికి చెందిన గాందెర్ల రజిత, ఆమె చిన్నారి కూతురుతో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పండింది. డ్రైవర్, ప్రయాణికుడు రంజిత్‌కు స్వల్పగాలవగా, రజిత, ఆమె కూతురు పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. వారిని ములుగు ఆస్పత్రికి తరలించారు.
మరో ఘటనలో వెంకటాపురం మండల కేంద్రం నుండి వీరభద్రాపురం గ్రామానికి వెళ్తున్న టిప్పర్ లారీ పాత్రపురం పంచాయతీ పాలెం గ్రామ శివార్లలో ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న మంగవాయి గ్రామానికి చెందిన కంతి అశోక్, ముకునూరు పాలెం గ్రామానికి చెందిన విష్ణుకు గాయాలయ్యాయి. వీరు అంకన్నగూడెం నుంచి వివాహ వేడుకలకు వెళ్లి వస్తుండగా ఘటన చోటుచేసుకోగా, విష్ణు పరిస్థితి విషమయంగా ఉండడంతో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
