- టీఐఎస్‌ఎస్ సహకారంతో ‘పబ్లిక్ పాలసీ’ కోర్సు
- 28 వరకు దరఖాస్తుకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: ములుగులోని ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’లో ఎంఏ (పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్) కోర్సులో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ప్రముఖ విద్యాసంస్థ టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హైదరాబాద్ సహకారంతో ఈ వినూత్న కోర్సును తీసుకొస్తోంది. పాలనాపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసినట్టు వర్సిటీ వీసీ వైఎల్ శ్రీనివాస్ తెలిపారు.
ఎంఏ ప్రోగ్రామ్ ఇంటర్ డిసిప్లినరీ విధానంలో ఉంటుందనీ, ఇందులో ఎకనామిక్స్, సోషియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, మేనేజ్‌మెంట్, డాటా అనలిటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ వంటి అంశాలను బోధించనున్నట్టు చెప్పారు. డిగ్రీలో 50శాతం ఆపై మార్కులు సాధించిన వారంతా దీనికి అప్లై చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.ssctu.ac.in యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించి, అక్కడున్న గూగుల్ ఫామ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 28 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. మరిన్ని వివరాలకు 93478 09918 లేదా 99663 67835 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తులు..
యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ, డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని వర్సిటీ అకాడమిక్స్ డీన్ ప్రొఫెసర్ జి.రాంరెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం కొత్త అకడమిక్ ప్రోగ్రామ్స్ కోసం ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోగా సమర్పించాలని సూచించారు.
