
2 రోజుల సెషన్ లో భాగంగా.. రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైంది. మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పలు బిల్లులు, ఆర్డినెన్స్ లను ప్రవేశపెట్టారు. మంత్రులు పలు ఆర్డినెన్స్ లను ప్రవేశపెట్టబోతున్నారు.
బోధనా వైద్యుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచుతూ చేసిన ఆర్డినెన్స్ సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. Exise, సర్వ శిక్షా అభియాన్ వార్షిక ఆడిట్ రిపోర్ట్ ను సభ ముందుంచారు.
కొత్త మున్సిపల్ చట్టానికి సంబంధించిన బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు.
చిన్న రైతుల రుణ విముక్తి చైర్మన్ నియామకానికి సంబంధించి కొన్ని నిబంధనలు సడలిస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తోంది ప్రభుత్వం. పబ్లిక్ ఎంప్లాయ్ మెంట్ రెగ్యులరేషన్ అమెండ్ మెంట్ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు.
పంచాయతీ రాజ్ ఆర్డినెన్సును సభలో ప్రవేశ పెట్టబోతున్నారు మంత్రి ఎర్రబెల్లి.