
ములుగు, వెలుగు : ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో వార్డుల విభజన ప్రక్రియ పూర్తికావస్తోంది. మున్సిపాలిటీలో 20 వార్డులుగా విభజిస్తూ మున్సిపల్ కమిషనర్ జే.సంపత్ ప్రతిపాదనలు రూపొందించారు. ఆయా వార్డుల్లోని ప్రజలకు అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో తెలపాలని కమిషనర్ సూచించారు. ఈనెల 5 నుంచి 11వతేదీ లోపు సూచనలు, సలహాలు, అభ్యంతరాలు తెలపాలని, లేనట్లయితే ఇదే ఫైనల్ గా భావించబడుతుందన్నారు. ములుగు మున్సిపాలిటీలో వార్డుల వివరాలు.. 20 వార్డుల్లో మొత్తం 13920మంది ఓటర్లు ఉన్నారు.
ఫస్ట్ వార్డులో జీవంతరావుపల్లి, గణేశ్ లాల్ పల్లి, 2వ వార్డులో పాల్‌సాబ్‌పల్లి, గడిగడ్డ, 3వ వార్డు బెస్తవాడ, వడ్డెరవాడ, సుభాశ్‌నగర్, సఫాయివాడ, 4వ వార్డు లక్ష్మీనగర్, గాంధీ పార్క్ఏరియా, బస్టాండ్, డీఎల్ఆర్ ఫంక్షన్‌హాల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రాంతాలు, 5వ వార్డు బృందావన్‌కాలనీలోని కొంత భాగం, ఎస్సీ కాలనీ, 6వ వార్డులో కాపు వాడ, 7వ వార్డులో మాధవరావుపల్లి, వీవర్స్ కాలనీ, దుర్గా కాలనీ, 8వ వార్డు ప్రేమ్ నగర్, ప్రగతి కాలనీ, ఏరియా ఆస్పత్రి వెనక భాగం, ఆదర్శ కాలనీ, 9వ వార్డు కృష్ణా కాలనీ, బీసీ కాలనీ, సాధన స్కూల్, బండారుపల్లి మెయిన్ రోడ్డు ఏరియా, 10వ వార్డు బండారుపల్లిలోని హనుమాన్ గుడి, పోచమ్మ గుడి, మసీదు, మెయిన్ రోడ్డు, 11వ వార్డు బీరన్న టెంపుల్, సర్ధార్ వల్లభాయ్‌పటేల్ కాలనీ, మధర్ థెరిసా కాలనీ, అటల్ బిహారీ వాజ్‌పేయి కాలనీ, 12వార్డులో మహాత్మా గాంధీ కాలనీ, మెయిన్ రోడ్డు ఏరియా, వివేకానంద, జవహార్‌లాల్ నెహ్రూ కాలనీలు, 13వ వార్డులో జగ్జీవన్ రాం.
సుభాశ్ చంద్రబోస్, భగత్ సింగ్కాలనీలు, బండారుపల్లి మెయిన్ రోడ్డు14వ వార్డు ములుగులోని ఎంపీడీవో ఆఫీస్ ఏరియా, హనుమాన్ బస్తీ, చాకలి వాడ, ఫారెస్ట్, కలెక్టరేట్ఆఫీస్ ఏరియా, 15వ వార్డు రంగారావుపల్లి, పోలీస్‌స్టేషన్, కోర్టు ప్రాంతాలు, 16వ వార్డు నాయకపోడ్ కాలనీ, పైడిమల్లయ్య స్ట్రీట్, ఏపీజీవీబీ బ్యాంక్ ఏరియా, 17వ వార్డు శివాలయం వెనుక వైపు, ఎక్సైజ్ కార్యాలయం ఏరియా, 18వ ఫకీర్‌వాడ, గొల్లవాడ, మార్కెట్ ఏరియా, 19 వీవర్స్‌కాలనీ, పెద్దతల్లి టెంపుల్ ఏరియా, 20వ వార్డు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఏరియా, నాయకపు వాడలో కొంత భాగం, మున్సిపల్ ఆఫీస్ఏరియాలు ఉన్నాయి.