మున్సిపల్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ లీడర్, చెన్నూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ అర్చన గిల్డా భర్త రామ్ లాల్ గిల్డా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు.
ఫిబ్రవరి 3న రాత్రి హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామ్ లాల్ గిల్డా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీ నాయకులు షాక్ కు గురయ్యారు. ఈ సందర్భంగా రామ్ లాల్ గిల్డా మాట్లాడుతూ.. చెన్నూరులో మంత్రి వివేక్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడినై కాంగ్రెస్ లో చేరినట్టు చెప్పారు.
