కేటీఆర్ ఇలాకాలో టీఆర్ఎస్ రెబల్స్ జోరు

కేటీఆర్ ఇలాకాలో టీఆర్ఎస్ రెబల్స్ జోరు

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇలాకాలో టీఆర్ఎస్ రెబల్స్ సత్తా చాటారు. ఆయన సొంత నియోజకవర్గమైన సిరిసిల్ల హెడ్ క్వార్టర్‌లో రెండో స్థానంలో నిలిచారు ఇండిపెండెంట్లు. సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 వార్డులు ఉండగా 24 స్థానాలతో టీఆర్ఎస్ విజయం సాధించింది. మున్సిపాలిటీ చైర్మన్ కుర్చీని సొంతం చేసుకుంది. అయితే ఇక్కడ మిగిలిన ప్రతిపక్ష పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. కానీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు మాత్రం ఏకంగా 10 స్థానాలను కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచారు. ఇక బీజేపీ మూడు వార్డులు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండింటితో సరిపెట్టుకుంది.