ఇటీవల కాలంలో జనాల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయింది. డైట్ ఫాలో అయ్యేవాళ్ళు, జిమ్ లకు వెళ్లేవారు, వాకింగ్, యోగ చేసేవారు క్రమంగా పెరుగుతున్నారు. డైట్ ఫాలో అవ్వాలనుకునేవారు, బరువు తగ్గాలన్నా, పెరగాలన్నా మొదట చేసే పని డ్రై ఫ్రూట్స్ కొనడం.. అయితే...అదే డ్రై ఫ్రూట్స్ వల్ల ప్రాణాలకే ప్రమాదం వస్తుందని అనుకుంటామా..? హైదరాబాద్ శివారులోని మల్లాపూర్ ఏరియాలో ఇలాంటి ఘటనే జరిగింది. గురువారం ( మే 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
మల్లాపూర్ లోని డ్రై ఫుట్ హౌస్ షాపులో నాసిరం డ్రై ఫ్రూట్స్ అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు అంటూ బాధితుడు భరత్ ఆవేదన వ్యక్తం చేశాడు.మల్లాపూర్ ప్రాంతానికి చెందిన భరత్ నెల రోజుల క్రితం డ్రై ఫ్రూట్స్ కొన్నానని...వాటిని ఇంటికి వెళ్లి చూడగా.. మొత్తం పురుగులతో నిండి ఉన్నాయని అంటున్నాడు.
►ALSO READ | పాత వాహనాల వేలం: మీ వెహికల్ పోయిందా? అంబర్‌పేట గ్రౌండ్స్‌లో చెక్ చేసుకోండి
ఈ విషయంపై షాపు ఓనర్ ను ప్రశ్నించగా....అతను చేసిన తప్పును ఒప్పుకోకుండా నీకి ఇష్టం ఉన్న చోట చెప్పుకో వాటిని రిటర్న్ తీసుకునే ప్రసక్తి లేదు అంటూ బెదిరిస్తున్నాడని వాపోయాడు బాధితుడు.ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న మా పాప అనారోగ్యానికి గురైందని... ఇలాంటి నాసిరకం డ్రై ఫ్రూట్స్ అమ్ముతున్న షాపులపై చర్యలు తీసుకొని వాటిని సీజ్ చేయాలని కోరుతున్నాడు బాధితుడు.
