మునుగోడు ఉపఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ

మునుగోడు ఉపఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ

మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని కేఏ పాల్ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించి.. ప్రజాశాంతిని గెలిపించాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోతే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. గతంలో ఏ సీఎం చేయని అవినీతిని కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. 

సీఎం కేసీఆర్ పీస్ మీటింగ్కు పర్మిషన్ ఇవ్వకుండా తుగ్లక్ పాలన సాగిస్తున్నారని కేఏ పాల్ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చి.. జనానికి తిండి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు కేసీఆర్కు విరోధిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి డబ్బులు ఇచ్చానని పాల్ తెలిపారు. మహాత్మ గాంధీతో కేసీఆర్ పోల్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. 2024లో కేసీఆర్ ఒక్క ఎంపీ సీటైనా గెలుస్తాడా అని ప్రశ్నించారు. సిరిసిల్లలో కేసీఆర్, కేటీఆర్లు తనపై దాడులు చేయించారని ఆరోపించారు.