
కూకట్పల్లి, వెలుగు: ప్రేమించిన యువతి కొన్ని రోజులుగా దూరంగా ఉంటుందని ఓ యువకుడు ఆమెపై హత్యాయత్నం చేశారు. మూసాపేటలో నివసించే యువతి అఫ్రిజా(19), మహ్మద్ మోషిన్(20) ఒకే స్కూల్లో చదువుకున్నారు. మొదట ఫ్రెండ్స్‌గా ఉన్న వీరు తరువాత ప్రేమలో పడ్డారు. మోషిన్ఎలక్ట్రీషియన్గా, అఫ్రిజా నర్సుగా పని చేస్తున్నారు. మోషిన్తరచూ గొడవ పడి తిడుతుండటంతో ఆమె కొన్ని నెలలుగా అతడికి దూరంగా ఉంటోంది.
ఆదివారం రాత్రి అఫ్రిజాకు ఫోన్‌చేసిన మోషిన్మాట్లాడుకుందామని పిలిచాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ మూసాపేట మెట్రో స్టేషన్ వద్ద కలిశారు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించిన మోషిన్వెంట తెచ్చుకున్న బ్లేడుతో యువతి పొట్టపై దాడి చేశాడు. పోలీసులు బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. కూకట్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.