
- పునరావాస కేంద్రానికి వచ్చిన మూసీ పరివాహక ప్రాంత ప్రజలు
హైదరాబాద్ సిటీ/అంబర్ పేట: మూసీ నదికి నీటి ప్రవాహం పెరగడంతో జీహెచ్ఎంసీ అలెర్టయ్యింది. 8 తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల్లోని వెయ్యి మందికి పైగా ప్రజలను తరలించింది. మలక్పేట సర్కిల్లోని శంకర్ నగర్ ప్రాంతంలో భారీగా వరద చేరడంతో 500 మందిని సమీపంలోని షాజాదీ మసీదుకు తరలించారు. ఎమ్మె ల్యే అహ్మద్ బలాల బాధితులకు పరామర్శించారు. మూసీ పరివాహక ప్రాంతమైన మూసానగర్ లో వర దనీటిలో చిక్కుకున్న 150 మందిని రెండు వేర్వేరు కమ్యూనిటీ హాళ్లకు తరలించి ఆశ్రయం కల్పించా రు. అంబర్ పేటలోని మూసారంబాగ్ బ్రిడ్జిపై వరద పెరగడంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
గోల్నాక కొత్త బ్రిడ్జి పైనుంచి ట్రాఫిక్ ను మళ్లించారు. భారీ వరదకు మూసారంబాగ్ కు రెండువైపులా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ తో పాటు కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం ఉంచిన సామాగ్రి కొ ట్టుకుపోయింది. బ్రిడ్జి పక్కనే ఉన్న న్యూ అంబేద్కర్ నగర్, కాచిగూడ కృష్ణానగర్ బస్తీలను ముంచె తింది. బ్రిడ్జి పక్కనే ఉన్న పెట్రోల్ పంప్ లోకి వరద చేరింది. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతీ దివాకర్, ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నరసయ్య, ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
దుర్గానగర్, అంబేద్క రనగర్కు చెందిన 45 కుటుంబాలను లంకాలోని ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి పంపించారు. గోల్నాక కమేలా వద్ద కృష్ణా నగర్ లో ఉంటున్న 32 మందిని కమ్యూనిటీ హాల్ కు తరలించారు. చాదర్ ఘాట్ లోని శివాజీ బ్రిడ్జి కింద భూలక్ష్మీ టెంపుల్ పరిసర ప్రాంతాల నుంచి 55 మందిని సురక్షిత ప్రాంతమైన గోడేకీఖబర్ జీహె చ్ఎంసీ కమ్యూనిటీ హాల్కు తరలించారు. దుర్గాన గర్కు చెందిన మరో 21 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు వెళ్లకుండా, ముందుజాగ్రత్త చర్యగా తమ ఇళ్లలోని పై అంతస్తులకు మారారు.