కోచింగ్ ఇచ్చి ఇంటికి వస్తుండగా..టీచర్ ను పాయింట్ బ్లాంక్ లో కాల్చిచంపారు 

కోచింగ్ ఇచ్చి ఇంటికి వస్తుండగా..టీచర్ ను పాయింట్ బ్లాంక్ లో కాల్చిచంపారు 

బిహార్​లో పట్టపగలే దారుణం.. ఓ ప్రైవేట్​ టీచర్​ అత్యంత కిరాతంగా  హత్యకు గురైంది.. విధులకు వెళ్లి వస్తున్న టీచర్​ ను మధ్యలో అడ్డగించి దాడి చేశారు. పిస్టల్​ తో కాల్పులు జరిపారు. సోదరుడి కళ్లముందే ఆమెను పాశవికంగా చంపేశారు. వివరాల్లోకి వెళితే.. 

బిహార్​ లోని ముజఫర్​ పూర్​ కు చెందిన 21 ఏళ్ల ప్రైవేట్​ టీచర్​ కోమల్​ ను గుర్తు తెలియని దుండగులు మంగళవారం (నవంబర్​18)కాల్చి చంపారు. ఆమె సోదరుడు ఆదిత్య తో కలిసి బైక్​ పై వెళ్తుండగా అడ్డగించిన దుండగులు ఆమెపై కాల్పులు జరిపారు. 

అడ్డగించిన దుండగులను ఎవరు మీరు అన్ని ప్రశ్నించే లోపే కోమల్​ పై కాల్పులు జరిపారు. కుప్పకూలిన కోమల్​ శరీరాన్ని కాళ్లతో తన్నారు.  మొదట రెండు రౌండ్ల కాల్పులు జరిపిన దుండగులు చనిపోలేదని మరో రౌండ్​ కాల్పులు జరిపినట్లు పోలీసుల చెబుతున్నారు. 

దుండగులను అడ్డుకునేందుకు ఆమె సోదరులు ఆదిత్య ప్రయత్నించగా ఈ లోపే జరగాల్సి అంతా జరిగి పోయింది.. కోమల్ పై కాల్పులు జరిపి అక్కడినుంచి పారిపోయారు దుండగలు. 
 కోమల్​ పై దాడి , హత్యకు కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.. ప్రేమ వ్యవహారమా? లేక పాత కక్షలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. 
కోమల్​మాజీ ప్రేమికుడిపై అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. కోమల్​ హత్య తర్వాత ఆమె మాజీ ప్రేమికుడు బిట్టును అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు..అయితే ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విడిచిపెట్టారు. సీసీ కెమెరాల పుటేజి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.