మై జీహెచ్ఎంసీ యాప్ ఇక మై క్యూర్

మై జీహెచ్ఎంసీ యాప్ ఇక మై క్యూర్

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూడు కార్పొరేషన్ల విభజన తరువాత సీఎంసీ, ఎంఎంసీ ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఇదివరకు జీహెచ్ఎంసీ ఫిర్యాదులు స్వీకరించే ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ను మై క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) యాప్ గా అధికారులు మార్చి మూడు చోట్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు. ఇకపై ఔటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు చెందిన సమస్యలను ప్రజలు ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా యాప్ అందుబాటులోకి తెచ్చారు.  

నగరంలోని అన్ని పౌర ఫిర్యాదులను ఒకే వేదికలో స్వీకరించే విధంగా యాప్ రూపొందించారు.  శానిటేషన్, స్ట్రీట్ లైట్లు, రోడ్లు, డ్రైనేజ్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపై ఫిర్యాదులు చేసేందుకు అవకాశంఉంది. ఫిర్యాదు చేసిన వారు ఆయా ఫిర్యాదులు ఏ పొజషన్ లో ఉన్నాయన్న రియల్ టైమ్‌లో ట్రాక్   సదుపాయం కూడా ఉంది.  

ప్రజలు మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వన్ స్టాప్ డిజిటల్ సొల్యూషన్ గా ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు.  ప్రస్తుతం అయితే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నుంచి ఈ మానిటరింగ్ జరగనుంది. సీఎంసీ, ఎంఎంసీ ల్లో పూర్తి స్థాయిలో ఆఫీసులు అందుబాటులోకి వచ్చేంత వరకు ఇక్కడే నుంచి కొనసాగే అవకాశముంది.