హైదరాబాద్ లో అంతు చిక్కని వైరస్.. లక్షణాలు ఇవే

హైదరాబాద్ లో అంతు చిక్కని వైరస్.. లక్షణాలు ఇవే

 

హైదరాబాద్ లో  మిస్టరీ వైరస్ కలకలం రేపుతోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తక్కువ ఆక్సిజన్ లెవల్స్ వంటి లక్షణాలతో చాలా మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనిని మొదట స్వైన్ ప్లూ, కోవిడ్ 19 కేసులుగా భావించి పరీక్షలు నిర్వహించారు. కానీ ఈ రెండు పరీక్షల్లో  నెగెటివ్ రిజల్ట్ రావడంతో ఇంతకూ ఈ వైరస్ ఏమిటన్నది అంతుపట్టడం లేదు. 100 డిగ్రీల ఫారెన్ హీట్ కు మించిన జ్వరం ఆగకుండా వచ్చే దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పలు, నీరసం, తలనొప్పి, చలి జ్వరం,ముక్కు కారడం ఈ వ్యాధి లక్షణాలు పెద్దలు, పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్రంగా ఉంటుందని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.

రెండు మూడు నెలలుగా ఇలాంటి లక్షణాలతో వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఈ రకం కేసులు తక్కువగా ఉన్నాయని వైద్యాధికారులు అంటున్నారు. ఇలా వచ్చిన వారు ఐదు రోజుల్లో కోలుకుంటున్నారని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో స్వైన్ ప్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. అయితే ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ లో తక్కువగానే ఉంది. కానీ స్వైన్ ఫ్లూ లక్షణాలతో ఆస్పత్రికి వస్తున్న వారిలో ఈ కొత్త రకం వైరస్ బయటపడటం ఆందోళన కల్గిస్తోంది. 

లక్షణాలు ఇవే 

  • దగ్గు, ముక్కుకారటం, జ్వరం, ఒంటినొప్పులు, నీరసం, తలనొప్పి