త్వరలోనే న్యాక్ కొత్త గ్రేడింగ్  సిస్టమ్

త్వరలోనే న్యాక్ కొత్త గ్రేడింగ్  సిస్టమ్
  • అందుకు అనుగుణంగా వర్సిటీలను రెడీ చేస్తున్న ప్రభుత్వం
  • మూడు వర్సిటీలకే ‘ఏ ప్లస్’ గ్రేడ్
  • రెండు వర్సిటీలకు అక్రెడిటేషన్  కరువు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హయ్యర్  ఎడ్యుకేషన్  ఇన్ స్టిట్యూషన్స్  నేషనల్  అసెస్‌‌మెంట్ అండ్  అక్రెడిటేషన్  కౌన్సిల్ (న్యాక్) గ్రేడింగ్ పై సర్కారు ఫోకస్ పెట్టింది. మెజారిటీ విద్యా సంస్థలకు న్యాక్  గుర్తింపు లభించేలా చర్యలు ప్రారంభించింది. త్వరలోనే న్యాక్  కొత్త గ్రేడింగ్ విధానాన్ని అమలు చేయబోతున్న నేపథ్యంలో, దానికి తెలంగాణ విద్యా సంస్థలనూ ప్రభుత్వం రెడీ చేస్తోంది.

ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో సర్కారు వర్సిటీల వీసీలతో ముఖ్యమంత్రి సలహాదారు కె.కేశవరావు, విద్యా శాఖ సెక్రటరీ యోగితా రాణా, హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చైర్మన్  బాలకిష్టారెడ్డి తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాక్  గుర్తింపు ప్రక్రియ, బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 యూనివర్సిటీల్లో ఉస్మానియా, జేఎన్టీయూ, కాకతీయ వర్సిటీలకు మాత్రమే ఏ ప్లస్  అక్రెడిటేషన్  ఉండగా, తెలంగాణ వర్సిటీ, శాతవాహన వర్సిటీలకు గుర్తింపు లేదు.

ప్రస్తుతం ప్రాసెస్​లో ఉందని అధికారులు చెప్తున్నారు. డాక్టర్  బీఆర్  అంబేద్కర్   ఓపెన్  యూనివర్సిటీ ‘ఏ’, మహత్మా గాంధీ వర్సిటీ ‘బీ’ ప్లస్, పాలమూరు వర్సిటీ ‘బీ’, తెలుగు యూనివర్సిటీ, జేఎన్ఏ అండ్ ఎఫ్​ఏయూ, ఆర్జీయూకేటీ వర్సిటీలు ‘సీ’ గ్రేడింగ్​లో ఉన్నాయి. ఏ ప్లస్  వచ్చిన మూడు వర్సిటీలు మినహా మిగిలిన వాటన్నింటికీ కనీసం ‘ఏ’ గ్రేడ్  వచ్చేలా చర్యలు తీసుకోవాలని సర్కారు సూచనలు చేసింది. దీనికి అనుగునంగా నిధులు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపింది.

ఈ క్రమంలోనే ఓపెన్ అండ్  డిస్టెన్స్  లర్నింగ్ ప్రోగ్రామ్‌‌లు, ఇతర వర్సిటీలతో ఎంఓయూలు, టీచింగ్  ఫ్యాకల్టీపై ఫోకస్  పెట్టారు. మరోపక్క ఇతర కాలేజీలకూ న్యాక్  గుర్తింపు కోసం అవసరమైన సహకారం అందించేలా హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  చర్యలు ప్రారంభించింది. త్వరలోనే కాలేజీల ప్రిన్సిపల్స్, మేనేజ్ మెంట్లతోనూ సమావేశం నిర్వహించి, గైడెలైన్స్ 
ఇవ్వనున్నారు.