
‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అని అంటున్నారు నాగార్జున. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో మెప్పించే ఆయన ఈసారి కంప్లీట్ మాస్ యాక్షన్ లుక్‌లో కనిపించబోతున్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చింది. ‘నా సామిరంగ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకుడు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగ్ బర్త్‌డే కానుకగా నిన్న ఆయన ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఆయన మేకోవర్ చాలా కొత్తగా ఉంది. స్టైల్‌గా బీడీ కాల్చుతూ, లుంగీ పైకి కట్టి.. మాసీ హెయిర్ స్టయిల్, గడ్డంతో రగ్డ్ లుక్‌లో కనిపించారు.
‘ఈసారి పండక్కి నా సామిరంగ’ అంటూ నాగ్ చెప్పగా.. ‘కింగ్ మాస్ జాతర’ మొదలు అంటూ మణిశర్మ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సినిమాపై అంచనాలు పెంచుతోంది. దర్శకుడు కరుణకుమార్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. రీసెంట్‌గా ఆయన సెట్‌లో జాయిన్ అయినట్టు, ఇందులో పవర్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించనున్నట్టు నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు తెలియజేశారు.