నా సామిరంగ మొదలుపెట్టిన నాగార్జున.. సంక్రాంతికి కింగ్ మాస్ జాతర

నా సామిరంగ మొదలుపెట్టిన నాగార్జున.. సంక్రాంతికి కింగ్ మాస్ జాతర

టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టేశారు. ఆగస్టు 29 నాగార్జున పుట్టినరోజు సందర్బంగా ఈ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నాగ్ కెరీర్ లో 99వ సినిమాగా రానున్న మూవీని ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్నీ(Vijay binny) తెరకెక్కించనున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్నా ఈ సినిమాకు నా సామిరంగ అనే మాసీ టైటిల్ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సంధర్బంగా చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ గ్లింప్స్ లో నాగార్జున లుంగీ కట్టుకొని, బీడీ కాలుస్తూ మాస్ అవతారంలో కనిపించారు. ఇక గ్లింప్స్ చివర్లో నాగ్ చెప్పిన.. ఈ పండక్కి నా సామిరంగ అనే డైలాగ్ ఆడియన్స్ ను ఎగ్జైట్ చేసింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మోడళ్ళు కానున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తుండగా.. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా.