సూపర్ స్పీడ్ : మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తానంటున్న నాగార్జున

సూపర్ స్పీడ్ : మూడు నెలల్లో సినిమా పూర్తి చేస్తానంటున్న నాగార్జున
  • సూపర్ స్పీడ్

స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే కనీసం ఆరు నెలలు పైనే పడుతుంది. కానీ మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి సంక్రాంతి రేసులోకి వస్తామంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్న చిత్రం ‘నా సామి రంగ’. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగార్జున బర్త్‌‌ డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌‌లో సంక్రాంతికి రిలీజ్ చేయడం ఫిక్స్ అని ప్రకటించారు.  రెగ్యులర్‌‌‌‌ షూటింగ్‌‌ను కూడా ఇటీవలే భారీ యాక్షన్ సీక్వెన్స్‌‌తో స్టార్ట్  చేశారు. అయితే సినిమా రిలీజ్‌‌కు ఇంక మూడు నెలలే సమయం ఉంది. ఈ విషయంలో టీమ్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతోందట. 

రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసి.. డిసెంబర్‌‌‌‌లో పోస్ట్ ప్రొడక్షన్‌‌ వర్క్‌‌పై ఫోకస్ చేయనున్నట్టు సమాచారం. ఓవైపు బిగ్‌‌ బాస్‌‌ షోకు హోస్ట్‌‌గా వ్యవహరిస్తూనే... సూపర్ స్పీడుతో ఈ సినిమా షూటింగ్‌‌ను కూడా పూర్తి చేయబోతున్నారు నాగార్జున. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నట్టు,  నాగార్జునకు జోడీగా ఆషికా రంగనాథ్​ నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ప్రసన్న కుమార్ బెజవాడ స్టోరీ, డైలాగ్స్ రాస్తుండగా.. ఆస్కార్ అవార్డ్‌‌ విన్నర్ కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.